Posts

కవితను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?

Image
  ఇంజినీరింగ్ చదివి ,  సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ.. తండ్రి కేసీఆర్ మొదలు పెట్టిన తెలంగాణ ఉద్యమంలో భాగమైన కల్వకుంట్ల కవిత…. తెలంగాణ జాగృతితో , బతుకమ్మతో ఒక ఐడెంటిటీ తెచ్చుకున్న కవిత.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక… నిజామాబాద్ ఎంపీగా గెలిచి.. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టిన ఎన్నో ప్రసంగాలు చేసిన కవిత… అన్నింటికీ మించి తెలంగాణ సీఎం కేసీఆర్ బిడ్డైన కవితకు లిక్కర్ స్కాంలో ఇరుక్కోవాల్సిన అవసరం ఏముంది ? మద్యం తాగేవాళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. కవిత లాంటి హైలీ ఇన్ఫ్లుయన్షియల్ ఉమెన్ పొలిటీషియన్.. చేస్తే గీస్తే తెలంగాణలో మద్యపాన నియంత్రణకు తనవంతు ప్రయత్నం చెయ్యాలి. అలా చెయ్యకపోగా.. లిక్కర్ డీల్స్ లో భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కోవడం ఏంటీ.. ?